![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ లో సాయికిరణ్ రోల్ అంటే చాలు చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. ఐతే ఈ సీరియల్ లో మహేంద్ర రోల్ అద్భుతంగా నటించాడు సాయి కిరణ్..అందులోనూ ముకేశ్ రిషికి తండ్రి పాత్రలో జీవించేసాడు. వీళ్ళిద్దరినీ చూస్తే తండ్రీ కొడుకులంటే నిజంలో కూడా ఇలానే ఉండాలి అనేంత ఆనందంగా కనిపిస్తారు. అలాంటి సాయికిరణ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా షూటింగ్ స్పాట్ లో చాయ్ తాగుతూ ఆరాంగా "మనిషి దెబ్బ తగిలి మెమరీ లాస్ ఐతే గనక అన్ని విషయాలు మర్చిపోతారు కానీ లాంగ్వేజ్ ని ఎందుకు మర్చిపోరు" అంటూ ఒక వెరైటీ ప్రశ్న వేసాడు. ఇక ఈ ప్రశ్న విన్న తర్వాత నెటిజన్స్ కూడా "అవునండి సేమ్ డౌట్ మాకు కూడా వచ్చింది.
ఎందుకంటే లాంగ్వేజ్ సెంటర్, మెమరీ సెంటర్ వేరు వేరుగా ఉంటాయండి అందుకే మెమరీ లాస్ ఐనా కానీ లాంగ్వేజ్ ని మారిపోరు...ఇది ఆలోచించాల్సిన విషయమే సర్ ..ఇంటెలిజెంట్ ప్రశ్న వేశారు " అంటూ తెగ మెచ్చేసుకుంటున్నారు. అలాగే పనిలో పని "సర్ గుప్పెడంత సీరియల్ లోకి రిషి సర్ ఎప్పుడు తిరిగి వస్తాడు...ఇలాంటి డౌట్స్ రావడం మా సర్ కె సాధ్యం" అంటున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయికిరణ్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి కిరణ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గ ఉంటాడు. వసుధారతో కలిసి రకరకాల వీడియోస్ చేస్తూ కనిపిస్తుంటాడు.
![]() |
![]() |